ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల మంజూరులో వాలంటీర్లకు ప్రభుత్వం తాజా ఆదేశాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులు మంజూరు చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ 25 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం అమలు కు ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతీ ఇంటిలో ఒకరికి ఆరోగ్యశ్రీ యాప్ తప్పనిసరి చేసింది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయడం, నూతన లబ్ధిదారులను గుర్తించడం, కొత్త కార్డులను ఇవ్వడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష గురించి అవగాహన కల్పించనున్నారు. దిశ యాప్‌ తరహాలో రూపొందించిన ఆరోగ్యశ్రీ యాప్‌ను కూడా ఇంటిలో ఒకరి మొబైల్‌ నెంబర్‌కు డౌన్‌లోడ్‌ చేయాల్సిఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో కొత్త కార్డులనుకూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఇంటింటికి వెడుతున్న సిబ్బంది వీటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇంటి యజయాని ఇకెవైసి తీసుకునే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల గురించి కూడా వీరు ప్రచారం చేయనున్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేది మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్‌బికె భవన్‌లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లబ్ది దారులను సమీకరించాలని ప్రభుత్వం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)