వచ్చే సంవత్సరం తగ్గనున్న ఇళ్ల ధరలు ?

Telugu Lo Computer
0


దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా అద్దెలు కూడా భారీగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల 10 నుంచి 15 శాతం అద్దెలు పెరిగాయి. గత 2 సంవత్సరాల్లో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు చేయగల స్తోమత తగ్గినట్లు రియల్​ ఎస్టేట్​ కన్సల్టెంట్​ జేఎల్​ఎల్​ ఇండియా నివేదిక వెల్లడించింది. అయితే ఇది వచ్చే ఏడాది మెరుగుపడవచ్చని అంచనా వేసింది. కొత్త సంవత్సరంలో రెపో రేటు తగ్గింపునకు అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఎక్కువ కావడం, రెపో రేటూ పెరగడంతో 2022లో ఇళ్ల కొనుగోలు తగ్గిందని వివరించింది. వచ్చే ఏడాది రెపోరేటులో 60 నుంచి 80 బేసిస్ పాయింట్ల తగ్గింపును జేఎల్​ఎల్​ అంచనా వేస్తోంది. డేటా ప్రకారం, ముంబైలో స్థోమత సూచిక 92 నుంచి 88కి తగ్గుతుందని అంచనా వేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్​లో ఇండెక్స్ 125 నుంచి 121కి, బెంగళూరు సూచీ 168 నుంచి 158కి పడిపోయిందని అంచనా వేశారు. హైదరాబాద్‌లో గత ఏడాది 174 వద్ద ఉన్న సూచీ 169 దగ్గరకు వెళ్లింది. పూణేలో 183 నుంచి 182కి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందట!. కరోనా కారణంగా చాలా వరకు నిర్మాణ పనులు నెమ్మదించాయని, దీంతో ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరం చాలా వరకు ఇళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం. డిమాండ్ తగ్గితే ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)