కోవిడ్‌ కొత్త వేరియంట్‌ పై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక !

Telugu Lo Computer
0


కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్‌ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్‌లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్‌ శాంపిల్స్‌ను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్‌-1 వేరియంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్‌ బయటపడింది. ఈ వేరియంట్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)