లడ్డాఖ్ ప్రాంతం మా దేశ అంతర్భాగం !

Telugu Lo Computer
0

మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడ్డాఖ్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమని చైనా వెల్లడించింది. భారత్ - చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 'లడ్డాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా భారత్ ఈ ప్రకటన చేసింది" అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ కోర్టు ఇచ్చిన అంతర్గత తీర్పు వాస్తవాన్ని మార్చదని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)