కాంగ్రెస్ ' క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ 'కు రాహుల్ విరాళం !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ కు విరాళం అందించారు. ఈ విరాళం "మైత్రీపూర్వక, ప్రగతిశీల"దేశానికి అని పేర్కొన్నారు. అందరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఆయన ఎక్స్ పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దేశం కోసం దానం ( డొనేట్ ఫర్ దేశ్ ) క్యాంపెయిన్ కు ఆయన విరాళం అందిస్తున్నట్టు కూడా వీడియో షేర్ చేశారు. అయితే ఎంత తాను విరాళంగా ఇచ్చిందీ వెల్లడించలేదు. పార్టీకి ఎంత విరాళం వస్తుందని పార్టీ కోశాధికారి అజయ్ మకేన్‌ను అడిగారు. కచ్చితంగా ఇంత అనీ ఏదీ నిర్ణయించలేదని, అయినా అనుకున్నదానికన్నా ఎక్కువే వస్తుందని మకేన్ వివరించారు. సంస్థల వారీ కాకుండా రాష్ట్రాల వారీ నిధులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించడమైందని, తరువాత స్థానాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని అజయ్ మకేన్ వివరించారు. డొనేట్ ఫర్ దేశ్ అనే క్రౌడ్ ఫండింగ్ క్యాంపైన్‌ను కాంగ్రెస్ సోమవారం ప్రారంభించింది. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తన మొదటి విరాళాన్ని అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)