ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలి !

Telugu Lo Computer
0


యోధ్యలో జనవరి 22న జరిగే బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజలు ఎవరూ రావొద్దని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లలోని దీపాలను వెలిగించి దీపావళి జరుపుకోవాలని సూచించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆ చారిత్రక రోజును ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అయోధ్యలో దాదాపు రూ.15,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను శనివారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ  జనవరి 22 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అయితే ఆ రోజున ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలని సూచించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజు.. అంటే జనవరి 23 నుంచి ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవచ్చని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)