ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటు !

Telugu Lo Computer
0

పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇమిటేట్ చేశారు. ఇందుకు విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. ఆ దృశ్యాలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఫోన్‌లో చిత్రీకరించారు. విపక్షాల చర్యను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవ మర్యాదలను కాపాడకుండా, సభాధ్యక్షునిపై హేళనగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)