ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లో ఐడీఎఫ్‌సీ విలీనం !

Telugu Lo Computer
0


ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఐడీఎఫ్‌సీ తమ అనుబంధ వ్యాపార సంస్థ అయిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లో విలీనం కాబోతోంది. ఈ విలీనానికి తాజాగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలో మరో మెగా విలీనానికి మార్గం సుగమైంది. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎలాగైతే విలీనం తర్వాత మెగా సంస్థగా ఏర్పడిందో ఇప్పుడు ఐడీఎఫ్‌సి కూడా అదే బాటలో వెళుతోంది. రివర్స్ మెర్జింగ్ విధానంలో ఐడీఎఫ్ సీ విలీనం జరగనుంది. ఐడీఎఫ్‌సీ   ఫస్ట్ బ్యాంక్ లో విలీనానికి గాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది ఐడీఎఫ్‌సీ  లిమిటెడ్. ఈ రెండు సంస్థలు కలిసి మెగా సంస్థగా ఏర్పడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల కన్ను ఈ విలీనంపై పడింది. పైగా విలీనం తర్వాత ఐడీఎఫ్‌సీ వాటాదార్లకు ప్రతి 100 షేర్లకు 155 ఐడీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ఇవ్వనున్నారు. విలీనం అనంతరం బ్యాంకు స్టాండలోన్ బుక్ విలువ ఒక్కో షేరుకు 4.9 శాతం పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విలీన ప్రతిపాదనను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బోర్డులు ఈ ఏడాది జులైలోనే అంగీకరించగా.. తాజాగా ఆర్‌బీఐ పర్మిషన్ వచ్చింది. దీంతో ఈ రెండు సంస్థల విలీనం వేగంగా పూర్తి కానుందని ఐడీఎఫ్‌సీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఐడీఎఫ్‌సీ లో ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ విలీనం అవుతుంది. ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్‌సీ విలీనం అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)