కీరవాణితో మురళీ మోహన్‌ వియ్యం !

Telugu Lo Computer
0


ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ నటుడు మురళీ మోహన్‌ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. 'నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి. త్వరలో ఆమె పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది' అని పేర్కొన్నాడు. మురళీ మోహన్‌ కొడుకు పేరు రామ్‌ మోహన్‌. ఈయన ఏకైక కుమార్తె పేరు 'రాగ'. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)