స్టాక్ మార్కెట్ లో రూ.9 లక్షల కోట్లు మటాష్ !

Telugu Lo Computer
0


స్టాక్ మార్కెట్  లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 425 పాయింట్లు డౌన్ అయ్యింది. ఇక మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే మిడ్ క్యాప్ షేర్లు అయితే అత్యంత దారుణంగా పతనం అయ్యాయి. 9 లక్షల రూపాయల జనం డబ్బు మటాష్ అయ్యింది. మార్నింగ్ స్టాక్ మార్కెట్ ప్రారంభంలో మిడ్ క్యాప్ షేర్లలో ర్యాలీ నడిచింది.. అన్ని షేర్లు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత షేర్లు పడటం ప్రారంభం అయ్యాయి. విదేశీ ముదుపరులు 600 కోట్లను మన మార్కెట్ నుంచి విత్ డ్రా చేసుకోవడం, కారోనా కేసులు ఇండియాలో పెరగటం,క్రూడ్ ఆయిల్ ధరలను కంపెనీలు పెంచటం.. ఈ మూడు కారణాల వల్లే స్టాక్ మార్కెట్ ఢమాల్ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)