మాల్‌లో 30 ద్విచక్ర వాహనాలు దగ్ధం

Telugu Lo Computer
0


ముంబై లోని లోయర్ పారేల్ ఏరియా ఫోనిక్స్ మాల్‌లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 30 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఫైరింజన్ సిబ్బంది అక్కడికి రాకముందే , మాల్ లోని మంటలనార్పే యంత్రం ద్వారానే మంటలను ఆర్పగలిగారు. ఈ ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)