స్కూటీకి రూ 3. 20 లక్షలు ఫైన్ !

Telugu Lo Computer
0


హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్ చెయ్యడంతో పాటు ట్రాఫిక్ నియమాలను ఏకంగా 643 సార్లు ఉల్లంఘించిన స్కూటీ పెప్ ద్విచక్ర వాహనం యజమాని మీద బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. 643 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సంఘటన వెలుగులోకి రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్కూటీపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ. 3. 22 లక్షల జరిమానా విధించారు. బెంగళూరులో నివాసం ఉంటున్న మాల అనే మహిళకు చెందిన స్కూటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్కూటీ మొత్తం 643 ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని స్కూటీ సీసీటీవీ కెమెరాలకు చిక్కిందని పోలీసు అధికారులు అంటున్నారు. స్కూటీ నంబర్ KA 04, KF 9072 అని పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరులోని ఆర్ టీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్కూటర్ యజమాని, ఆ స్కూటర్ నడుపుతున్న వ్యక్తి కోసం బెంగళూరు పోలీసులు వెతకడం ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన ఈ స్కూటీ మార్కెట్ ధర రూ. 20,000 నుండి రూ. 30, 000 మధ్య ఉంటుందని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ఆ స్కూటీ యజమాని ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వ్యాప్తించడంతో హాట్ టాపిక్ అయ్యింది, ట్రాఫిక్ కెమెరాల నిఘా కళ్ళను తక్కువగా అంచనా వేస్తున్న వ్యక్తులు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనచోదకులు ఈ మ్యాటర్ తెలుసుకుని హడలిపోయారు,

Post a Comment

0Comments

Post a Comment (0)