12 మంది డీఎస్పీలకు ఏసీపీలుగా పదోన్నతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో డీఎస్పీలుగా పనిచేస్తున్న 12 మంది పోలీసుల అధికారులకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.కె.ఎం నాయుడును , ద్వారకలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తిని, ఈస్ట్‌ గోదావరి జిల్లాలో దిశ విభాగంలో పనిచేస్తున్న కె. తిరుమల రావు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఏపీఎస్పీ ఏటీపీలో పనిచేస్తున్న డి.వి రమణ మూర్తి, అనంతపురం పీటీసీలో పనిచేస్తున్న జె. మల్లిఖార్జున వర్మ, బాపట్ల ఏసీబీలో పనిచేస్తున్న ఏ.వి రమణకు పదోన్నతి కల్పించింది. జమ్మలమడుగులో పనిచేస్తున్న ఎన్‌. నాగరాజు, శ్రీకాళహస్తిలో పనిచేస్తున్న వి. భీమారావు, కాకినాడ ఎస్‌బీలో పనిచేస్తున్న మొగలి వెంకటేశ్వరరావు, ఉత్తర విశాఖపట్నంలో పనిచేస్తున్న ఎం. శివరామిరెడ్డి, ఏలూరు ఎస్‌ఈబీలో పనిచేస్తున్నా ఎం. రమేశ్‌రెడ్డి, సీఐడీలో పనిచేస్తున్న వి.శ్రీరాం బాబుకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది .

Post a Comment

0Comments

Post a Comment (0)