వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 20 November 2023

వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం !


రైళ్లల్లో ప్రయాణికుల భద్రత, ఛార్జీలకు సంబంధించిన అంశాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. రైళ్లల్లో ప్రవేశపెడుతున్న డైనమిక్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొన్నిసార్లు రైలు ఛార్జీలు విమాన ఛార్జీలకంటే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఛార్జీల భారం ప్రయాణికులపై ఉండకూడదన్నారు. సువిధ రైళ్లలో ఛార్జీలు విమాన టికెట్ ఛార్జీల కన్నా ఎక్కువగా ఉండటం విచారకరమని, అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులు ఎలా ప్రయాణం చేస్తారని ఆమె ప్రశ్నించారు. రైళ్లల్లో టికెట్ ఛార్జీల పెంపును తగ్గించాలని, ప్రయాణికుల భద్రతా పరమైన అంశాలపై దృష్టిసారించాలని కోరారు. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై దీదీ స్పందించారు. తాను రైల్వేమంత్రిగా ఉన్న రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ప్రమాద నిరోధక పరికరాలు ప్రవేశపెట్టాననిని, వాటిని ఇప్పుడు ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు. ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురై 300కుపైగా ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఉన్నతాధికారులు ఆధునికీకరిస్తున్నారు. తాను రైల్వే మంత్రిగా చేసిన సమయంలో ప్రమాదాలను నివారించేందుకు అనేక పరికరాలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుతం పక్కన పడేయడం చూస్తుంటే తాను వాటిని ప్రవేశపెట్టాను కాబట్టి వాడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వ్యక్తులకన్నా వ్యవస్థ ముఖ్యమని దీదీ హితవు పలికారు.

No comments:

Post a Comment