యూఏఈలో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

యూఏఈలో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు !

కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు 11 ఏళ్ల క్రితం యూఏఈకి వలస వెళ్ళారు. అక్కడ ఉన్న ఓ ఆయిల్ కంపెనీలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ ప్రతిరోజు జరిగే మహ్ జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రా టికెట్టు కొనుగోలు చేశారు. ఆ లాటరీని బుధవారం రివీల్ చేశారు. ఆ లాటరీలో ఏకంగా 45 కోట్లు గెలుచుకున్నాడు. శ్రీజు మాట్లాడుతూ అప్పుడు నేను కారులో ఉన్నాను, నా మహ్ జూజ్ ఎకౌంట్ చూద్దామని అనిపించింది. వెంటనే ఓపెన్ చేసి చూశాను నా కళ్ళు తిరిగాయి. నాకు లాటరీ వచ్చిందని నమ్మలేకపోయాను. మహ జూజ్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పేదాకా నేను నమ్మలేకపోయాను అని తెలిపారు. మన భారతీయులు చాలామంది అరబ్ దేశాల్లో ఉన్నారు. వారికి కూడా ఇలాగే చాలామందికి లాటరీ వచ్చింది. అరబ్ దేశంలో ఉన్న మరో భారతీయుడు కూడా ఈ మహజూజ్ సాటర్డే మిలియన్స్ లక్కీ డ్రా లో జాక్పాట్ కొట్టాడు. ముంబై కి చెందిన మనోజ్ భన్సర్ అరబ్ దేశంలోని అబుదాబిలో పదహారేళ్లుగా ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అతడికి కూడా ఈ లక్కీ డ్రాలో 16 లక్షల దాకా లాటరీ తగిలింది. ఈ జాక్పాట్ తో మనోజ్ తన అప్పులని తీర్చానని సంతోషంగా చెప్పారు. అయితే యూఏఈ లోని లాటరీలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎలాంటి టాక్స్ లేకుండా గెలిచిన మొత్తాన్ని విజేతలకు అందిస్తారు. అదే ఇతర దేశాలలో అయితే చాలావరకు టాక్స్ కట్టాల్సి వస్తుంది.

No comments:

Post a Comment