జయప్రకాశ్ నారాయణ ఉద్యోగుల ఆగ్రహం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 6 November 2023

జయప్రకాశ్ నారాయణ ఉద్యోగుల ఆగ్రహం !


ద్యోగులకు ఓపీఎస్ పైన తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీని పైన ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా, మేధావిగా పేరుండి ఉద్యోగుల బాధలు, ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా ఉద్యోగుల పక్షాన మాట్లాడాల్సింది పోయి, ఉద్యోగులకు అన్యాయం చేసేలా మాట్లాడటం ఏంటని నిలదీస్తున్నారు. కార్పోరేట్ శక్తులకు రూ 25 లక్షల కోట్ల రుణామాఫీ చేస్తే రాని ఆర్దిక సంక్షోభం సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ఇస్తే ఎలా వస్తుందో జేపీ సమాధానం చెప్పాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 30-35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగి భద్రతతో కూడా ఫించన్ పొందాలనుకోవటం ప్రజాస్వామ్యబద్దమైన కోరిక కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసి ఉంటే ప్రతీ పదవికి విడివిడిగా ఫింఛన్ తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం ఓపీఎస్ పునరుద్దరిస్తే కొంపలు అంటుకుపోతాయా అని నిలదీస్తున్నారు. కొత్త పెన్షన్ విధానం వచ్చినా పాత పెన్షన్ విధానమే అమలు చేస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల ఆర్దిక వ్యవస్థ ఏనాడు కుప్ప కూలలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఆర్టికల్ 309 ప్రకారం సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రవేశ పెట్టే అధికారం ఉందని రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు నిరూపిస్తున్న తరుణంలో ఇంకా ఓపీఎస్ పునరుద్దరణ పై విష ప్రచారం చేయటం మానుకోవాలని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసమే జేపీ ఈ విధంగా మాట్లాడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేపీ ఆంధ్రప్రదేశ్ కి వస్తే నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు. జేపీ రెండు పెన్షన్లు తీసుకుంటూ ఉద్యోగులకు ఓపీఎస్ అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానం గురించి మాట్లాడకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment