ఏఐతో పెంపుడు జంతువుల భావాలను అర్ధం చేసుకోవచ్చు ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 6 November 2023

ఏఐతో పెంపుడు జంతువుల భావాలను అర్ధం చేసుకోవచ్చు ?


ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. కలలో సైతం ఊహించని ఆవిష్కరణలకు బీజం పడుతోంది. ఏఐతో ఎన్నో సంక్లిష్టమైన అంశాలను ఇట్టే పరిష్కరిస్తుండగా లేటెస్ట్ టెక్నాలజీపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఇక ఏఐ ద్వారా పెంపుడు జంతువులు మీకు ఏం చెబుతున్నాయనేది తెలుసుకోవచ్చు. మీరు ఇష్టంగా పెంచుకునే కుక్క, పిల్లి మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాయనేదాన్ని కృత్రిమ మేథ ద్వారా పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ఎన్నో వీడియోలను ఉపయోగిస్తూ పిల్లులు, కుక్కలు, గుర్రాల ముఖంలో పలికే భావాలను పసిగట్టేందుకు పరిశోధకులు ఏఐని వాడుతున్నారు. ఈ పరిశోధన పెంపుడు జంతువులతో సంభాషించే ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు ఈ జంతువుల మనస్తత్వాన్ని, ప్రాధమిక జీవవైవిధ్యాన్ని విపులీకరించనుంది. ఏఐ టూల్ ద్వారా జంతువులు తోక ఊపడం, మొరగడం, అరవడం వెనుక ఉన్న మర్మాన్ని మనుషులు అర్ధం చేసుకోగలుగుతారు. పెంపుడు జంతువులు మీకు ఏం చెప్పదలుచుకున్నాయనేది ఇట్టే పసిగట్టే వెసులుబాటు కలుగుతుంది. పెంపుడు జంతువులు ఏం చెబుతున్నాయనేది తెలుసుకునేందుకు ఏఐ సామర్ధ్యం ఉపయోగపడుతుందని, పెంపుడు జంతువుల మనస్తత్వం గురించి ఏఐ మనకు ఎంతో బోధిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లింకన్‌కు చెందిన వెటర్నరీ మెడిసిన్ ప్రొఫెసర్ డేనియల్ మిల్స్ చెప్పుకొచ్చారు. పిల్లి ఇతర పిల్లులతో మాట్లాడే క్రమంలో 276 ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను ప్రదర్శిస్తుందని సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో పరిశోధకులు రాసుకొచ్చారు. ఈ క్రమంలో పెంపుడు జంతువుల భావోద్వేగాలను, ముఖ కవళికలను అర్ధం చేసుకోవడంలో ఏఐ శాస్త్రవేత్తలకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment