కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 16 November 2023

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు !


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ నేతను ఉద్దేశించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను నపుంసకుడు అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రాజస్థాన్ లో గిరిజన బాలికలను నగ్నంగా ఊరేగిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా కూర్చోవడం సిగ్గుచేటని విమర్శించారు. జైపూర్‌లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ, రాజస్థాన్‌లోని ఒక ప్రధాన నగరంలో పిల్లలకు తల్లి సరస్వతి ఆశీర్వాదం ఇచ్చిన ఉపాధ్యాయుడిని పట్టపగలు సజీవ దహనం చేశారని అన్నారు. బహిరంగ సభలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ.. ''మహా నాయకుల రక్తంతో పునాదులు వేసిన రాష్ట్రం రాజస్థాన్‌'' అని అన్నారు. అనంతరం ఒక పోలీసు ఉదంతాన్ని ప్రస్తావించారు. ఒక పోలీసు దళిత బాలికను కిడ్నాప్ చేసి, ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు. దీన్ని ప్రస్తావిస్తూ “కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పోలీసు యూనిఫాం ధరించి ఆమెపై అత్యాచారం చేశాడు. వారి ఇంట్లో కోడలు సురక్షితంగా ఉండగలదా? కోడలు, ఆడపడుచుల పట్ల గౌరవం కోరుకునే ప్రతి కుటుంబానికీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం'' అని అన్నారు. భిల్వారా ఘటనను ప్రస్తావిస్తూ కూతురిపై అత్యాచారం చేసి, బట్టలు విప్పి, ముక్కలు ముక్కలుగా నరికి పొయ్యిలో పడేస్తే దానిపై రాజస్థాన్ అసెంబ్లీలో చర్చ జరిగిందని, అయితే కాంగ్రెస్‌ నేత ఇది పురుషుల రాష్ట్రమంటూ వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ విషయాలపై తాను సీఎం అశోక్ గెహ్లాట్‌ను అడగాలనుకుంటున్నానని, కాంగ్రస్ పార్టీలో ఇంత నపుంసకుడు ఎవరని, సజీవంగా ఉన్న స్త్రీని చూసిన తర్వాత రక్తం ఉడకదా అని ప్రశ్నించారు.

No comments:

Post a Comment