స్కూల్లో తుపాకితో మాజీ విద్యార్థి కాల్పులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 21 November 2023

స్కూల్లో తుపాకితో మాజీ విద్యార్థి కాల్పులు !


కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో వివేకోదయం బాయ్స్‌ హయ్యర్ సెకండరీ స్కూల్లో తుపాకితో మాజీ విద్యార్థి కలకలం సృష్టించాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు త్రిసూర్‌లోని వివేకోదయం మాజీ విద్యార్థి జగన్‌ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పాఠశాలలోకి ప్రవేశించాడు. నేరుగా స్టాఫ్‌ రూంకు వెళ్లిన జగన్‌ తనతో పాటు తెచ్చుకున్న ఎయిర్‌ పిస్టల్‌ను జేబులో నుంచి తీసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులను బెదిరించాడు. దీంతో టీచర్లంతా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత పక్కనే ఉన్న క్లాస్‌ రూంకి వెళ్లి స్టూడెంట్స్‌కు గన్‌ చూపించి బెదరించాడు. అంతేకాకుండా  మూడు రౌండ్స్ గాల్లో కాల్పులు కూడా జరిపినట్టు విద్యార్థులు, టీచర్లు తెలిపారు. ఆ తర్వాత జగన్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, విద్యార్థులంతా సేఫ్‌ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా నిందితుడు డ్రగ్స్‌ బానిసయ్యాడని, మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే జగన్‌ పాఠశాలకు ఎందుకు వచ్చాడు, అతడికి గన్‌ ఎక్కడిదనే దానిపై విచారిస్తున్నట్టు త్రిసూర్‌ క్రైం బ్రాంచ్‌ ఏసీపీ మీడియా తెలిపారు. 

No comments:

Post a Comment