రాజధానిలో మానవత్వం మంటగలిసిన వేళ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

రాజధానిలో మానవత్వం మంటగలిసిన వేళ !

                                   

ఢిల్లీలో అక్టోబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో యంగ్  డైరెక్టర్ పీయూష్ పాల్ ప్రాణాలు కోల్పోయాడు. కల్కాజీలో నివాసముంటున్న పీయూష్‌ పాల్‌ గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 30 రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, అదే దారిలో వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పాల్‌ సమీపంలోని చెట్టును ఢీకొని గాయపడటం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. దాదాపు అరగంట పాటు రక్తపు మడుగులో ఉన్న పీయూశ్​ను  ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న పీయూష్‌ను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం అవ్వడం వల్ల చికిత్స పొందుతూ పాల్‌ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కొంత సమయం ముందు తీసుకువస్తే బతికే అవకాశం ఉండేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన నిందితుడిని బంటీగా గుర్తించారు. సమీపంలోని పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీలో రికార్డైన వివరాలు ప్రకారం బాధితుడు పీయూష్ పాల్ ను బైక్ ఢీ కొనడంతో కిందపడిపోయాడు. పీయూష్ ముఖం.. తలకు బలమైన గాయాలయి... తీవ్ర రక్తస్రావం అయింది. ఇది అతని మరణానికి దారితీసింది.

No comments:

Post a Comment