గర్భిణులు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 16 November 2023

గర్భిణులు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు !


ప్రతి తల్లీ తన బిడ్డ అందంగా.. ఆరోగ్యంగా జన్మించాలని ఆశపడుతుంది. కానీ.. కొందరికి పుట్టుకతోనే పలు సమస్యలు వస్తుంటాయి. దీనికి జన్యుపరమైన అంశాలతోపాటు తల్లి చేసే పొరపాట్లు కూడా కొంత వరకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ రూపాన్ని DNA నిర్ణయిస్తుందని అందరికీ తెలుసు. జుట్టు రంగు నుంచి మొదలు పెడితే కంటిపాప రంగు వరకు, ఎత్తు నుంచి బరువు దాకా.. చివరకు చిన్న చిన్న మచ్చలను కూడా DNA నిర్ణయిస్తుంది. ఇందులో మనం చేయడానికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీ సమయంలో అధికంగా కెఫిన్ తీసుకుంటే అది నవజాత శిశువు బరువును ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందట. ఫలితంగా బరువు తక్కువగా ఉండే శిశువులు జన్మించే అవకాశం ఉంటుందట. కాబట్టి గర్భిణులు కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కప్పు కాఫీకి పరిమితం కావాలని అవకాశం ఉంటే మరింతగా తగ్గించాలని సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సిండ్రోమ్‌తో గర్భంలో పెరుగుతున్న పిండం చిన్న కళ్లు, సన్నని పెదవులు వంటి అసాధారణ ముఖ లక్షణాలతో పుట్టే ప్రమాదం ఉంటుందట. అలాగే పిల్లల ప్రవర్తనపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందట. గర్భిణులకు తిండి పదార్థాలపై కోరికలు కలగడం సహజం. ఆ సమయంలో తల్లి తీసుకునే పదార్థాలలో ఉండే షుగర్ లెవల్స్ కూడా బిడ్డపై ప్రభావాన్ని చూపుతాయట. ఇది శిశువు రూపాన్ని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. పోషకాహారం కోసం తల్లిపై ఆధారపడే కడుపులోని బిడ్డకు రక్తంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలు హానికరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అదనపు చక్కెర.. శిశువులో కొవ్వుగా స్టోర్ అవుతుందట. దాంతో ఊబకాయం, మధుమేహం, కామెర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అందువల్ల.. తీపి పదార్థాలను తినడం తగ్గించడంతోపాటు షుగర్ లెవల్స్ నార్మల్​గా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇందుకోసం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. పుట్టబోయేశిశువు బరువును గాలి కాలుష్యం కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అందువల్ల. గర్భిణులు వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దాంతోపాటు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణులు విమానంలో ఎక్కువగా ప్రయాణించడం  బిడ్డ రూపంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రేడియేషన్ ఎక్కువగా ప్రభావం చూపొచ్చు. దీనివల్ల.. కడుపులో పెరుగుతున్న పిండం పెరుగుదలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకూ గర్భిణులు ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

No comments:

Post a Comment