వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టుకు ఐదుగురు భారత క్రికెటర్ల ఎంపిక - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 9 November 2023

వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టుకు ఐదుగురు భారత క్రికెటర్ల ఎంపిక


వన్డే వరల్డ్‌కప్‌-2023కి సంబంధించి ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ తమ ఫేవరెట్‌ (వరల్డ్‌ ఎలెవెన్‌) జట్టును ప్రకటించింది. లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ తమ జట్టులో చోటు కల్పించింది. ఇందులో ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఎంపిక చేయబడగా విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీలకు సభ్యులుగా చోటు దక్కింది. ఈ జట్టుకు వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ ఎంపిక చేయబడగా.. న్యూజిలాండ్‌ రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా), మార్కో జన్సెన్‌ (దక్షిణాఫ్రికా), ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా) ఇతర సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో నాలుగు జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం లభించింది. భారత్‌ నుంచి ఐదుగురు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా నుంచి తలో ఇద్దరు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ఆటగాళ్లంతా ప్రస్తుత ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. 

No comments:

Post a Comment