ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 20 November 2023

ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు !


యిరిండియాను బెదిరిస్తూ ఇటీవల వీడియో విడుదల చేసిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం కేసు నమోదు చేసింది. సిక్కులు ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు, ఖలిస్థాని ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్, నవంబర్ 4న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చబడుతుందని, నవంబర్ 19 న అది మూసివేయబడుతుందని ఒక వీడియో ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ రోజున ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించాలనుకునే వ్యక్తులను బెదిరించాడు. వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పాడు. ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర), 153ఎ, 506 (క్రిమినల్ బెదిరింపు) కింద దర్యాప్తు సంస్థ పన్నూన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే నవంబర్‌ 19న వరల్డ్‌ క్రికెట్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను పోలుస్తూ వరల్డ్‌ టెర్రర్‌ కప్‌ మాదిరిగా ఆ రోజు ఉంటుందని ఆ వీడియోలో బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

No comments:

Post a Comment