టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది !


మిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడిగా ఉండటానికి  ఇష్టపడుతున్నట్లు శివగంగ కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. శివగంగ జిల్లా కారైక్కుడి సమీపంలోని మానగిరి ఫాం హౌస్‌లో కార్తీ చిదంబరం తన 53వ జన్మదినాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 'ఇండియా' కూటమి బలంగా ఉందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 39 స్థానాలు కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహారాష్ట్ర, బిహార్‌లో 'ఇండియా' కూటమి విజయం తథ్యం అన్నారు. కూటమిలో కొన్ని పొరపచ్ఛాలున్నాయని, ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం చర్చిస్తామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై నోటీసులు పంపి విచారణ చేయవచ్చని అన్నారు. దాడులు అనేది మీడియా, టెలివిజన్‌ కోసం 'షో' మాత్రమేనన్నారు. తనకు బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం లేదు, కానీ టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఉండాలని ఇష్టపడుతున్నట్టు ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు.

No comments:

Post a Comment