తగ్గుముఖం పట్టిన ఉల్లి ధరలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 3 November 2023

తగ్గుముఖం పట్టిన ఉల్లి ధరలు !


దేశవ్యాప్తంగా ఉల్లిపాయలను కిలోకు రూ.25 చొప్పున సబ్సిడీపై కేంద్రం విక్రయిస్తోంది. నవంబర్ లో రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లి పాయలను తరలించనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ ఢిల్లీలోని అజాద్ పూర్ మండిలో ఉల్లి హోల్ సేల్ ధర రూ. 30 కి పడిపోయింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గనున్నాయి. ప్రభుత్వ సహకార సంఘాలు ఉల్లిని విక్రయించడం వల్ల ఇండోర్, భోపాల్, రాయ్‌పూర్, జైపూర్ వంటి నగరాల్లో రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. పండ్లు, కూరగాయలకు ఆసియాలోనే అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిలో ఉల్లి పాయల హోల్ సేల్ దర రూ. 60 నుంచి 65 లు ఉండగా రూ. 30 నుంచి 40 కి పడిపోయింది. అయితే రిటైల్ మార్కెట్ పై దీని ప్రభావం ఇంకా కనిపించడం లేదు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 28న ఉల్లిపై కేంద్రం ఎగుమతి ధర (ఎంఈపీ) ని పెంచడం, ఖరీఫ్ పంట మార్కెట్లో రావడం, నవంబర్ లో మార్కెట్లో లక్ష టన్నుల ఉల్లిని కేంద్రం విడుదల చేయడంతో హోల్ సేల్ ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment