తమిళ సీనియర్ హీరో గంగా మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 12 November 2023

తమిళ సీనియర్ హీరో గంగా మృతి


కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. టి.రాజేందర్‌ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా అనే చిత్రంతో ఇండస్ట్రీకి గంగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న గంగా ఆ తరువాత క్రైం తొడుమ్‌ అలైగళ్, మురుగేశన్‌ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించాడు. 53 ఏళ్లు అయినా గంగా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక హాస్పిటల్ కు తీసుకెళ్లినా కూడా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈయన భౌతిక కాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్తూర్‌ చావడి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక గంగా.. అవకాశాలు ఉన్నంతవరకు హీరోగా నటించి, అనంతరం టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు. ఇక గంగా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు. 

No comments:

Post a Comment