షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నానా పటేకర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 15 November 2023

షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నానా పటేకర్ !


బాలీవుడ్ విలక్షణ నటుడైన నానా పటేకర్ పేరు మీటూ ఉద్యమంలో బాగా వినిపించింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా అతడిపై తీవ్ర ఆరోపణలు చేసి మీటూ ఉద్యమానికి తెరతీసింది. నానా పటేకర్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాడని బహిరంగంగా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో తీవ్ర దూమారం లేపాయి. ఆమె కామెంట్స్‌తోనే మీటూ ఉద్యమం బీజం పడింది. అలా తనుశ్రీ దత్తా ఆరోపణలతో వివాదంలో చిక్కున్న నానా పటేకర్ తాజాగా మరో వివాదంలో పడ్డాడు. తనతో సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిపై చేయి చేసుకుని కాంట్రవర్సీ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వారణాసిలో జరగుతున్న తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌లో పటేకర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ వీధుల్లో షూటింగ్ నిర్వహించగా సెట్ మధ్యలో ఓ యువకుడు వచ్చి ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని గమనించిన పటేకర్ వెంటనే వెనకనుంచి తలపై కొట్టడంతో అతడు ముందుకు వెళ్లాడు. దీంతో పక్కనే ఉన్న బౌన్సర్‌ సదరు యువకుడి మెడ పట్టుకుని బయటకు నెట్టాడు. ఈ సంఘటన వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నానా పటేకర్‌పై ఫైర్ అవుతున్నారు. 'ఈ నటులను మనము దేవుళ్లలా ఆరాధిస్తాం కాబట్టి.. వారితో దెబ్బలు తినేందుకు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. నానా పటేకర్ లాంటి స్టార్ నటుడు ఓ యువకుడిపై చేయి చేసుకోవడం దారుణం. అతడు స్టార్‌డమ్ అనే పిచ్చిలో ఉన్నాడు' అంటూ అతడిపై ఫైర్ అవుతున్నారు. వీరు అసలుహీరోలు కాదు.. నిజానికి రియల్ హీరోలు అంటే సరిహద్దుల్లో ఉండేవారు. తెరపై ఉండేవారు కాదు' అంటూ నానా పటేకర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment