బెంగళూరులో ప్రభుత్వాధికారి దారుణ హత్య ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 5 November 2023

బెంగళూరులో ప్రభుత్వాధికారి దారుణ హత్య !


ర్ణాటకలోని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ ప్రతిమ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డొక్కలసంద్రలో గోకుల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆమెను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే నివసిస్తున్నారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ప్రతిమ హత్యకు గురైన సమయంలో ఆమె భర్త, కొడుకు తీర్థహళ్లిలో ఉన్నట్లు వెల్లడైంది. ఎప్పట్లాగే ప్రతిమ శనివారం తన విధులు నిర్వర్తించుకొని రాత్రి 8 గంటలకు తన నివాసానికి చేరుకున్నారు. డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కొద్దిసేపటికే గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి, ఆమెను హత్య చేసి పారిపోయారు. ప్రతిమ సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదివారం ఉదయమే ప్రతిమ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కి గురయ్యాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎంత వెతికినా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. దీంతో తెలిసిన వారే పక్కా ప్లానింగ్‌తో ప్రతిమను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసుపై మరింత సమాచారం కోసం విచారణ జరిపిస్తామని చెప్పారు. అటు.. హంతకులను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. డ్రైవర్ వదిలేసి వెళ్లిన కాసేపటికే ఆమెకు హత్యకు గురవ్వడంతో.. ఇది తెలిసిన వాళ్లే చేసిన పని అని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. ప్రతిమ కొంతకాలం నుంచి తన భర్తకు దూరంగా ఉంటుందని, వీరి మధ్య విభేదాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.

No comments:

Post a Comment