కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 19 November 2023

కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం !


సినిమా, రాజకీయ రంగంలో రాణించిన విజయ్ కాంత్  అనారోగ్య సమస్యతో చెన్నై లోని మయత్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చాలా కాలం నుంచి మధుమేహ సమస్య తో బాధపడుతున్న కారణంగా ఆయన కాలి వేళ్ళకు రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు విజయ్ కాంత్ కాలి వేళ్ళను తొలగించారు. అంతే కాదు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం కాస్త క్షీణించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. సినిమా రంగంలో నటుడుగానే కాకుండా  నిర్మాత, దర్శకునిగా కూడా మంచి గుర్తింపు పొందారు. 1991లో 100 వ చిత్రం “కెప్టెన్ ప్రభాకరన్” సినిమాతో విజయ కాంత్ ను కెప్టెన్ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. 40 ఏళ్ళ సినీ జీవితంలో 100 కు పైగా సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల ఆదరణను పొందారు. సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయ కాంత్.. 2005 లో DMDK పార్టీనీ స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 

No comments:

Post a Comment