ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త : కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 5 November 2023

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త : కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక !


వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవని వ్యక్తులకు డబ్బులు పంపించవద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులకు పొరపాటున కూడా డబ్బులు పంపించవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. స్కామర్లు ప్రజల్ని మోసం చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్‌కి చెందిన ఓ ఇంజనీర్‌ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ మహిళ ద్వారా రూ. 1కోటిని కోల్పోయాడు. క్రిప్టో స్కామ్ ద్వారా సదరు మహిళ అతడిని మోసం చేసింది. స్కామర్లు ప్రతీ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగిస్తున్నారు. యూపీఐ యాప్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, చివరకు ట్రావెట్ వెబ్సైట్ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. డేటింగ్ యాప్స్, మాట్రిమోనియల్ వెబ్సైట్స్‌ని మోసాలకు వేదికగా ఉపయోగిస్తున్నారు. స్కామర్లు డేటింగ్, మ్యా్ట్రిమోనియల్ సైట్లను ఉపయోగించి ప్రేమ ఉచ్చులోకి లాగి ఖరీదైన బహుమతులు పంపిస్తామనే సాకుతో డబ్బులు చెల్లించాలని బలవంతం చేస్తున్నారు. భారతీయ వయోజనుల్లో 66 శాతం మంది ఆన్‌లైన్ డేటింగ్ స్కామ్స్ బారిన పడ్డారు. సగటున రూ. 8 చొప్పున డబ్బును కోల్పోయారు.

No comments:

Post a Comment