ఇజ్రాయెలీ కార్గో షిప్​ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 20 November 2023

ఇజ్రాయెలీ కార్గో షిప్​ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు !


టర్కీ నుంచి మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్‌ను ఎర్ర సముద్రంలో యెమెన్ లోని హైతీ తిరుగుబాటుదారులు ఆదివారం హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. అయితే, తాము ఇజ్రాయెలీ కార్గో షిప్​ను యెమెన్ తీరానికి తరలించామంటూ హైతీ ప్రతినిధులు తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ నౌక తమ దేశానికి చెందినది కాదని, అందులో వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులు ఉన్నారని, ఇజ్రాయిలీలు మాత్రం లేరని డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది. ''గెలాక్సీ లీడర్​గా పిలిచే ఈ నౌకను సౌత్ రెడ్ సీలో యెమెన్ దగ్గరలో హైజాక్ చేశారు. ఇది ఘోరమైన పరిణామం. ఇంటర్నేషనల్​లో వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించే విషయమిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'అని ట్వీట్​లో పేర్కొంది. గేలాక్సీ లీడర్​ను ఇరాన్ సాయంతోనే హైతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ట్విట్టర్​లో మండిపడింది.


No comments:

Post a Comment