ముగింపు వేడుకలకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

ముగింపు వేడుకలకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు !


వరల్డ్ కప్ కు ఇండియా వేదికగా నిలవటంతో బీసీసీఐ ముగింపు వేడులను భారీగా ప్లాన్ చేసింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇక భారత్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఒళ్లంతా కళ్లతో భారతీయులు ఎదురు చూస్తున్నారు. విశ్వవిజేతగా భారత్ విజయాన్ని ఆశిస్తు..ఆకాంక్షిస్తు యావత్ భారతం కళ్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంపైనే ఉన్నాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన అభిమానుల్ని బీసీసీఐ మంత్రముగ్ధులను చేయనుంది. ఆటే కాదు పాటలతో మైమరపించే ఏర్పాట్లు చేసింది. ఆదివారం భారత్‌ - ఆసీస్‌ మధ్య తుది పోరుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షకు పైగా ప్రేక్షకులు హాజరుకాబోయే మోదీ స్టేడియంలో అభిమానులను అలరించబోయే కళాకారుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్‌లో విరామ సమయంలో జరిగిన ఈవెంట్‌ల ఫ్లో చార్ట్‌ను భారత క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అహ్మదాబాద్‌ వేదికగా జరుగబోయే మ్యాచ్‌కు ముందే ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్‌ ముగిసిన తర్వాత 1:35 నుంచి 1:50 గంటల దాకా భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ ఏరోబోటిక్‌ వైమానిక విన్యాసాలు అలరించనున్నాయి. దీని కోసం ఇప్పటికే సూర్యకిరణ్‌ ఫైటర్ జెట్ లు రిహార్సల్స్‌ చేయటం..అవి ముగియటం కూడా జరిగింది. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఆదిత్య గాధ్వి మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ లో సమయంలో గుజరాత్‌కు చెందిన సింగర్‌, లిరిసిస్ట్‌ ఆదిత్య గధ్వి ప్రదర్శన ఉంటుంది. తన గానమాధుర్యంతో ప్రేక్షులను అలరించనున్నారు. ఒక ఇన్నింగ్స్‌ ముగిశాక బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాస్ సింగ్, తుషార్ జోషీలలు తమ గానలతో అలరించనున్నారు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ ముగిసి రెండో ఇన్నింగ్స్‌ డ్రింక్స్‌ బ్రేక్‌ సమయంలో లేజర్‌ అండ్‌ లైట్‌ షో కూడా జరుగనుంది. ఇలా పలు కార్యక్రమాలతో ముంగింపు వేడుకల్ని బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది.


No comments:

Post a Comment