యూరిక్‌ యాసిడ్‌ - ఆహార నియమాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

యూరిక్‌ యాసిడ్‌ - ఆహార నియమాలు !


రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, శరీరంలో టాక్సిన్స్ కూడా పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది కొన్ని ఆహారాలు, పానీయాలలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్ధాలను శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ ఉత్పత్తి. సాధారణంగా యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా వెళుతుంది. ఆ తర్వాత మూత్రం రూపంలో విసర్జించబడుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలు సరిగా పనిచేయవు. ఫలితంగా పాదాల నొప్పుల నుంచి చేతుల వరకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, పేగు సంబంధిత సమస్యలను నివారించడానికి, సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సమస్య నివారణకు ప్రముఖ పోషకాహార నిపుణులు శిఖా అగర్వాల్ కొన్ని రకాల మూలికలను సూచిస్తున్నారు. ఈ మూలికలను రోజూ తింటే చాలా వరకు సమస్యలు అదుపులో ఉంటాయని సూచిస్తున్నారు. శీతాకాలంలో పసుపు తప్పనిసరిగా తీసుకోవాలి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేటరీ సమస్యను అరికట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. సమస్య నివారణకు ప్రతిరోజూ ఉదయం కొద్దిగా పసుపు, చెరకు బెల్లం తింటే సరిపోతుంది. యూరిక్ యాసిడ్ నివారించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం రెండు కప్పుల అల్లం టీ తాగాలి. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరించడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది. ధనియాలు) యూరిక్ యాసిడ్ నిరోధించడానికి కూడా బాగా పనిచేస్తాయి. ధనియాలను నీళ్లలో బాగా మరిగించి టీ తయారు చేసుకోవచ్చు. ఈ గింజలు నానబెట్టిన నీళ్లను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగినా చాలా మేలు జరుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి అలాగే కీళ్లనొప్పులకు సహాయపడుతుంది. గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి త్రాగాలి. రోజుకు రెండుసార్లు తాగితే నొప్పులు అదుపులో ఉంటాయి. అవిసె గింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని వివిధ రకాల మంటలను నిరోధించడంలో సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకుంటే బరువు కూడా తగ్గుతుంది.

No comments:

Post a Comment