మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచార యత్నం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచార యత్నం !

త్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో మహిళా మేజిస్ట్రేట్​పై ఉన్నతాధికారి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఓ బీజేపీ నేత తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు నాయబ్ తహసీల్దార్​. అయితే, ఈ విషయాన్ని ఓ బిజెపి నాయకుడు సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్​ను ఆయన యూపీ గవర్నమెంట్‌తో పాటు ఆ రాష్ట్ర డీజీపీకి కూడా ట్యాగ్​ చేయడంతో విషయం వెలుగుచూసింది. బస్తీ జిల్లాలో నాయబ్​ తహసీల్దార్​గా పని చేస్తున్నాడు. ఆయన దీపావళి పండుగ రోజు అర్థరాత్రి మహిళ అధికారి ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. ఆ మహిళ తలుపులు తీయకపోవడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న మహిళ అధికారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే, ఆ మహిళ తహసీల్దార్ బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అధికారి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. తన చేతులతో ఆ మహిళ గొంతు నులిమాడు. దాంతో ఆ మహిళ పడిపోయింది. ఆమె చనిపోయిందనుకున్న అధికారి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ మహిళ ఒక్కసారిగా లేచి దాక్కుందామని ప్రయత్నించింది. అది గమనించిన అధికారి మళ్లీ ఆమెను చంపేందుకు సిద్ధపడ్డాడు. అతని బారి నుండి తప్పించుకునేందుకు ఆమె విశ్వప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో అధికారిని గదిలోకి తోసేసి బయట గడియ పెట్టి అక్కడి నుంచి బయటపడింది. ఆ తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి అధికారిపై ఫిర్యాదు చేసింది. అయితే ఆ మహిళ అధికారి ఆరోపణలను పోలీసులు ముందు పట్టించుకోలేదు. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్​ సింగ్‌కు తెలియడంతో ఆయన రంగంలోకి దిగారు. ఈ సంఘటన గురించి ఆయన తన ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఆ పోస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డిజిపికి ట్యాగ్​ చేయడంతో ఈ సంఘటన గురించి అందరికి తెలిసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం మహిళా అధికారి ఫిర్యాదు మేరకు నాయబ్ తహసీల్దార్‌పై కేసు నమోదు చేయడం జరిగింది.

No comments:

Post a Comment