51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైన 'ఫెరారీ 250 జీటీవో' - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 14 November 2023

51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైన 'ఫెరారీ 250 జీటీవో'


న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 1962 నాటి 'ఫెరారీ 250 జీటీవో' 51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీనిని అనామక బిడ్డర్‌ ఆర్ఎమ్ సోథెబీస్ కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర సుమారు రూ. 430 కోట్లు కంటే ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన కార్ల జాబితాలో ఇది స్థానం సంపాదించింది. ఫెరారీ 250 జీటీవో ప్రారంభంలో 4.0 లీటర్ ఇంజిన్ కలిగి 7500 ఆర్‌పీఎమ్ వద్ద 3910 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేది, ఆ తరువాత 3.0-లీటర్ జీటీవో డెవలప్‌మెంటల్ ఇంజన్ అమర్చారు. అప్పట్లోనే ఈ కారుని రేసింగ్‌లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది 1965 సిసిలియన్ హిల్‌క్లైంబ్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని పొందింది. గతంలో ఫెరారీ క్లబ్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ యాజమాన్యంలో ఉన్న ఈ కారు కావల్లినో క్లాసిక్‌లో FCS ప్లాటినం అవార్డు, కొప్పా బెల్లా మచినా అవార్డు గెలుచుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముడైన కారు మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే. ఇది జర్మనీలో జరిగిన వేలంలో రూ. 1202 కోట్లకు అమ్ముడైంది.

No comments:

Post a Comment