తెలంగాణ ఎన్నికల బరిలో 4,798 మంది అభ్యర్థులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 12 November 2023

తెలంగాణ ఎన్నికల బరిలో 4,798 మంది అభ్యర్థులు !


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 17 రోజుల టైమ్ ఉంది. దీంతో పొలిటికల్ హడావుడి బాగా పెరిగింది. ఐతే, కీలకమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారం ముగిసింది. నిజానికి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ఉండాలి. కానీ అభ్యర్థులు భారీ సంఖ్యలో వచ్చారు. వారందరి నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించేసరికి అర్థరాత్రి అయ్యింది. కొంతమంది రెండేసి నామినేషన్లు సమర్పించారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 5,716 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. మొత్తం 4,798 మంది అభ్యర్థులు ఈ నామినేషన్లు వేసినట్లు వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసే, ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అత్యధికంగా 154 నామినేషన్లు వేశారు. దీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో కూడా 104 నామినేషన్లు దాఖలయ్యాయి. తద్వారా అక్కడ కూడా సీఎం కేసీఆర్‌ని ఓడించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గజ్వేల్ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 127 నామినేషన్లు వచ్చాయి. అలాగే ఎల్బీ నగర్‌లో 87, సిద్ధిపేటలో 76, హుజూరాబాద్‌లో 62 నామినేషన్లు వచ్చాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో ఒకటైన కొడంగల్‌లో 26 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఐతే.. ఈ నామినేషన్లపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చెయ్యలేదు. సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఈ నెల 15 లోగా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే, డిపాజిట్ మనీ వెనక్కి ఇచ్చేస్తారు. అలా తీసుకోకపోతే, డిపాజిట్ మనీ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తీసుకునే వీలు ఉంటుంది. 

No comments:

Post a Comment