శ్రీలంక నుంచి మారిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 21 November 2023

శ్రీలంక నుంచి మారిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక !


శ్రీలంక క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగాల్సిన అండర్ -19 వరల్డ్ కప్ వేదికను దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు మెంబర్స్ 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఒమన్, యూఈఏలో టోర్నీ జరపాలనే ప్రస్తావన వచ్చినా మంచి స్టేడియాలు, ఇతర సౌకర్యాలు ఉన్న దక్షిణాఫ్రికావైపు బోర్డు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఐసీసీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అండర్ -19 వరల్డ్ కప్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగనుంది.

No comments:

Post a Comment