కొత్తగా 188 ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు !

Telugu Lo Computer
0


పేద ప్రజల ప్రయోజనాల కోసం ఈ ఏడాదిలోనే అదనంగా 188 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం బెంగళూరులోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన కనకదాస జయంతి కార్యక్రమంలో కనకదాస విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. ఇందిరా క్యాంటీన్లు సక్రమంగా నడపకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య బదులిస్తూ బెంగళూరులోని 225 వార్డుల్లో కూడా ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతే కాకుండా అవసరమైన చోట ఇందిరా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఇందిరా క్యాంటీన్‌కు స్థలాభావం లేనిచోట్ల మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, అన్ని ఇందిరా క్యాంటిన్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే బీఆర్‌. పాటిల్‌తో ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందించారు. మా పార్టీ ఎమ్మెల్యే బీఆర్‌. పాటిల్‌తో చర్చించామని, శాసన సభా సమావేశాలకు హాజరయ్యేలా ఆయన్ను ఒప్పించామని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. నిమాన్స్‌ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక రోగి మృతి చెందడంపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ నిమ్హాన్స్ డైరెక్టర్‌తో చర్చిస్తానని, ఇక ముందు ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూస్తామని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. బెంగళూరు నగరంలో ఇందిరా క్యాంటిన్లకు పూర్వవైభవం తీసుకురావాలని, ఇందిరా క్యాంటిన్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం సిద్దరామయ్య సూచించారని తెలిసింది. అతి తక్కువ ధరకు ఇందిరా క్యాంటిన్లలో ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించడానికి ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)