ఒక్క డోసు ఖరీదు రూ. 17 కోట్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 9 November 2023

ఒక్క డోసు ఖరీదు రూ. 17 కోట్లు !


వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న రెండేళ్లలోపు పిల్లలకు ఉపయోగించే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ జన్యు చికిత్స కోసం ఉపయోగించే జోల్జెన్స్మా ఇంజెక్షన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది భారతదేశంలో ఆమోదించబడనప్పటికీ, వైద్యుని సిఫార్సు, ప్రభుత్వ ఆమోదం ద్వారా దీన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ ప్రయోజనంతో పాటు, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మందులలో ఒకటి. ఒక్క డోసుకు దీనికయ్యే ఖర్చు దాదాపు రూ. 17 కోట్లు. దీని ధర పలు సంఘటనల ద్వారా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలే ప్రధాని మోదీని కలిసి విషయాన్ని ప్రస్తావించారు. 15నెలల చిన్నారి ట్రీట్మెంట్ కు సహాయం చేయాలని అభ్యర్థించారు. జోల్జెన్స్మా ఇంజెక్షన్ ను స్విస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవార్టిస్ అభివృద్ధి చేస్తోంది. దీన్ని SMA అనే అరుదైన జన్యు వ్యాధి చికిత్స కోసం ఉద్దేశించబడింది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వెబ్‌సైట్ ప్రకారం, వెన్నెముక కండరాల క్షీణత నరాలు, కండరాలను ప్రభావితం చేస్తుంది. దీని వలన కండరాలు బలహీనంగా మారతాయి. ఇది ఎక్కువగా శిశువులు, పిల్లలను ప్రభావితం చేస్తుంది కానీ ఇటీవలి కాలంలో ఇది పెద్దలలో కూడా అభివృద్ధి చెందుతుంది. సుమారు 10వేల నుంచి 25వేల మంది పిల్లలు, పెద్దలు యునైటెడ్ స్టేట్స్‌లో SMAతో బాధపడుతున్నార

No comments:

Post a Comment