మానవతా సాయంపై పాలస్తీనా అధ్యక్షుడికి మోడీ హామీ !

Telugu Lo Computer
0

శ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడితో యుద్ధం మొదలై ఇంకా సాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు.సోమవారం గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై బాంబుదాడిలో వందలాది మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్రమోడీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిస్తూనే ఉంటామని హమీ ఇచ్చారు. తీవ్రవాదంపై, ఈ ప్రాంతంలో హింస, ఆందోళనను పంచుకున్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారతదేశ దీర్ఘకాలిక సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ విషయాలను ప్రధాని తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)