రాజకీయ లబ్ది కోసం ఇంకెన్నాళ్లు శ్రీరాముడ్ని వాడుకుంటారు ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 25 October 2023

రాజకీయ లబ్ది కోసం ఇంకెన్నాళ్లు శ్రీరాముడ్ని వాడుకుంటారు ?


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న 'హిందుత్వ' రాజకీయాల గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా.. రామ మందిర నిర్మాణం మొదలైనప్పటి నుంచి బీజేపీ రాజకీయాలు దాని చుట్టే తిరుగుతున్నాయి. తమ వల్లే ఈ రామ మందిరం సమస్య తీరిందని ఒకటే డప్పు కొట్టేసుకుంటున్నారు. ఈ సమస్య తీరడం నిజంగా మంచి విషయమే. కానీ.. ఆ విషయాన్ని ప్రతిసారి రాజకీయాల్లోకి లాగడమే దురదృష్టకరం. తమ రాజకీయ లబ్ది కోసం ఈ మందిరాన్ని, శ్రీరాముడ్ని బీజేపీ సాయశక్తులా వినియోగించుకుంటోంది. జనాలను ఎమోషనల్‌గా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అందుకే.. ఈ అంశంపై ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్ని సార్లు శ్రీరాముడ్ని ఉపయోగించుకుంటారని నిలదీశారు. కేవలం ఆయన నామస్మరణం చేయడం తప్పితే.. ఆయనలోని మంచి గుణాలు బీజేపీలో ఏమాత్రం లేవని తూర్పారపట్టారు. ''బీజేపీ.. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీరాముడ్ని ఇంకా ఎన్నిసార్లు వాడుతారు? మీరు రాముడి గుణాలను ఎందుకు అలవర్చుకోవడం లేదు. వీరత్వం, శౌర్యం, విధేయత, కరుణ, ప్రేమ, ధైర్యసాహసాలు వంటి రాముడి గుణాలు.. మీ పాలనలో కనిపించవు'' అని ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ లబ్ది కోసం రాముడి పేరుని వాడటం మానేసి.. ఆయన గుణాల్ని అలవర్చుకొని, ప్రజలకు మంచి చేయాలని ఆయన సూచించారు. దసరా వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ  రాముని మందిరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరామునికి అంకితం చేయబడిన ఒక గొప్ప ఆలయాన్ని తాము నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీరాముడు త్వరలోనే రాబోతున్నాడని, వచ్చే రామనవమి ఇక్కడే వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. ఆ సమయంలో రాంలాలా మందిరంలో ప్రతిధ్వనించే ప్రతి స్వరం యావత్ ప్రపంచానని సంతోషపరుస్తుందని అన్నారు. ఇలా మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే కపిల్ సిబల్ పై విధంగా ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment