రైస్‌ వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 27 October 2023

రైస్‌ వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు !


రైస్‌ అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతామని, అలాగే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్‌ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్‌లతో సరిపెట్టేస్తారు. అదేం అవసరం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూటిషియన్లు కూడా రైస్‌ను హాయిగా తినొచ్చని అంటున్నారు. అదంతా కేవలం అపోహే అని తేల్చి చెబుతున్నారు. ఆ రైస్‌కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఆహారంలో రైస్‌ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధపడుతుంటారు. కానీ అది నిజం కాదని చెబుతున్నారు న్యూటిషియన్‌ పూర్ణిమ. ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పూర్ణిమ యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. అదే రైస్‌కి వెనిగర్‌ కలిపి వండుకుంటే గ్లూకోజ్‌ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్‌ని జోడించడం వల్ల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే రైస్‌కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్‌ లభిస్తుంది. ఆటోమెటిక్‌గా గ్లైసెమిడ్‌ ఇండెక్స్‌ తగ్గుతుందని సోయాబీన్‌ లేదా సోయాబీన్‌ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక​ సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతాం. పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్‌క్రాట్‌, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది. ఎసిటిక్‌ యాసిడ్‌తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్‌ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, సలాడ్‌లు (మిక్సిడ్‌ కూరగాయాలు) తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది. ఇది కుదరనట్లయితే రైస్‌లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్‌ అని  చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించగలం అంటున్నారు .  అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్‌ చేశారు. 

No comments:

Post a Comment