ఉగ్రవాదులే లక్ష్యంగా మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

ఉగ్రవాదులే లక్ష్యంగా మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు !


గ్రవాద స్థావరమైన జెనిన్​లోని అల్-అన్సార్ మసీదుపై ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్​ వైమానిక దాడులు జరిపింది. పౌరులపై దాడులు జరిపేందుకు ఈ మసీదు నుంచే ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులకు పాల్పడింది. దీనిపై తమ ఇంటెలిజెన్స్​ నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్​ డిఫెన్స్​ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్​పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలపై ఈ దాడి జరిపినట్లు వారు పేర్కొన్నారు. ఇద్దరు బందీలను విడిచిపెట్టిన తరువాత తామొక మానవతా సంస్థగా చెప్పుకునేందుకు హమాస్​ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్​ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హామాస్ ఐసిస్​ కంటే దారణమైన సంస్థ అనే విషయాన్ని ప్రపంచం మరిచిపొదన్నారు. గాజా స్ట్రిప్ ప్రజలను​ హమాస్ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పౌరుల మౌలిక సదుపాయాలపై రాకెట్లతో దాడి చేస్తోందని దుయ్యబట్టారు. గాజాపై దాడులను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్​ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్​పై యుద్ధాన్ని తరువాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. గాజా స్ట్రిప్​ దాడి చేసినప్పుడుల్లా ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుదని హెజ్​బొల్లా హెచ్చరించింది. ప్రస్తుతం తాము ఈ పోరాటంలోనే ఉన్నామని హెజ్​బొల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ కస్సెమ్ తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్​ డ్రోన్​ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెజ్​బొల్లా కూడా ఇజ్రాయెల్​పై దాడులకు దిగుతోంది.

No comments:

Post a Comment