మధుమేహం - లైంగిక సామర్థ్యం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 31 October 2023

మధుమేహం - లైంగిక సామర్థ్యం !


ధుమేహం కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్అధికంగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మం మార్పులు, జుట్టు రాలడం, కంటి సమస్యల రిస్క్ పెరుగుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వ్యక్తుల్లో రెటినోపతి, శుక్లం సమస్యలు సాధారణం. వీటికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వ్యాధి శరీర అంతర్గత ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నోటిలో మంట వంటి అసౌకర్య పరిస్థితులు తలెత్తవచ్చు. ఈ సమస్య రోగనిరోధక శక్తి లోపించడానికి సంకేంతం. దీంతో ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం  పెరుగుతుంది. గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. వీరిలో ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. మధుమేహంతో ముడిపడి ఉన్న ఊబకాయం కారణంగా ఎముకలపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. ఇన్సులిన్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఎముక జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో ఎముక క్షీణత, ఎముక సాంద్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం కొల్లాజెన్‌లో అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్  లెవల్స్ పెంచుతుంది. ఇది ఎముక నాణ్యత ప్రతికూలం ప్రభావం చూపుతుంది. మధుమేహం సోకిన వారి కీళ్లలో అసౌకర్యం లేదా దృఢత్వం సన్నగిల్లవచ్చు. కీళ్ల కదలిక, కీళ్ల వాపు వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చు. చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లుగా అనిపింవచ్చు. ఇది కండరాల బలహీనతకు దారితీస్తుంది. రోజువారీ యాక్టివిటిస్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆస్టియోపెనియా, బోలు ఎముకల వ్యాధి వంటి రిస్క్ పెరుగుతుంది. దీంతో ఎముకలు పెలుసులా మారి పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. పురుషుల లైంగిక సామర్థ్యం డయాబెటిస్ కారణంగా క్షీణిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా అంగస్తంభన లోపాలు, అకాల స్కలనం వంటి సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడమంటే కేవలం రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడం మాత్రమే కాక, కండరాలు, ఎముకలు, కీళ్ల సంబంధిత కణజాలాలతో సహా శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాంటిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని జటిలమైన కనెక్షన్‌లను అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు తమ అవయవాలు, కణజాలాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా పర్యవేక్షణ, సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, వ్యాయమం, మందులు అనేవి మధుమేహ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. 

No comments:

Post a Comment