చంద్రబాబుతో లోకేశ్‌, బ్రాహ్మణి ములాఖత్‌ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 23 October 2023

చంద్రబాబుతో లోకేశ్‌, బ్రాహ్మణి ములాఖత్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబుతో నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు తెదేపా నేత మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు. తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు ట్వీట్‌ చేశారు. మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరమని లోకేశ్‌ అన్నారు. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమన్నారు. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నానని నారా భువనేశ్వరి అన్నారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

Post a Comment