ఇంత దిగజారుడు రాజకీయాలా ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 23 October 2023

ఇంత దిగజారుడు రాజకీయాలా ?

మహిళా ప్రజా ప్రతినిధితో ఓ పార్టీలో దిగిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ చిత్రాలను వైరల్‌ చేయడాన్ని నీచ రాజకీయాలంటూ ఖండించారు. ఈ మేరకు ఆయన కేరళలోని కొట్టాయంలో మీడియాతో మాట్లాడారు. 'ఇవి దిగజారుడు రాజకీయాలు. ఆ ఫొటోలు ఆమె పుట్టినరోజు వేడుకలో దిగినవి. ఆమె నా కంటికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఆమె నాకంటే 10 నుంచి 20 ఏళ్లు చిన్నది. ఆ వేడుకలో 15 మంది పాల్గొన్నారు. నా సోదరి కూడా అక్కడ ఉంది. కానీ కొందరు దురుద్దేశపూర్వంగా పార్టీకి వచ్చిన మిగతావారిని తొలగించి, అదొక వ్యక్తిగత సమావేశంగా ఫొటోలను వక్రీకరించారు. ఈ ఫొటోలు చూసినవారు ఒక విషయాన్ని గమనించండి. అది రహస్య సమావేశం అయితే మరి ఆ ఫొటోలు ఎవరు తీసుంటారు..? అది ఒక పుట్టినరోజు వేడుక' అని అన్నారు. అలాగే నెట్టింట్లో వస్తోన్న విమర్శలను తాను పట్టించుకోనన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ప్రాముఖ్యత ఇస్తానని థరూర్‌ చెప్పారు. ఇంతకుముందే ఈ ఫొటోలపై సదరు మహిళా ప్రతినిధి స్పందించారు. 'నాకు తెలుపు రంగు కంటే ఆకుపచ్చ రంగు నచ్చుతుంది. ఎందుకు ఫొటోలను క్రాప్‌ చేశారు. డిన్నర్‌కు వచ్చిన మిగతావారిని కూడా చూపించండి' అని విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చారు.

No comments:

Post a Comment