అమెరికాలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

అమెరికాలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ !


త్తర అమెరికాలోని మేరీలాండ్‌లో  అత్యంత ఎతైయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ' పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన 19 అడుగుల ఈ విగ్రహాన్ని అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్‌ 14న మేరీలాండ్‌లోని ఎకోకీక్‌ నగరంలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని 'అంబేద్కర్ ఇంటర్నేషనల్‌ సెంటర్‌' పేర్కొంది. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్‌ సుతర్‌ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. భారత్‌ సహా ఇతర దేశాల సంతతికి చెందిన దాదాపు 500 మంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు ఏఐసీ తెలిపింది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్‌ సెంటర్‌, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిచింది. ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి 'దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ' అధ్యక్షుడు నర్రా రవి కుమార్‌ హాజరయ్యారు. ప్రతిపౌరుడు సాధికారత సాధిస్తేనే దేశం ఆర్థికంగా సుసంపన్నం అవుతుందని అంబేద్కర్ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆయన ప్రతిపాదించిన ఆ ఆర్థిక విధానమే ఇప్పుడు కార్యరూపం దాలుస్తోందని తెలిపారు.

No comments:

Post a Comment