వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 30 October 2023

వలస కార్మికుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు !


కాశ్మీరులోని పుల్వామాలో సోమవారం ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకేష్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. పుల్వామా జిల్లాలోని తుంచి గ్రామంలో కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులలలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు ఆ తర్వాత మరనించినట్లు వారు చెప్పారు. శ్రీనగర్‌లో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

No comments:

Post a Comment