శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు


న్డేల్లో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడంతో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తంగా 31 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. శుభ్‌మన్ గిల్ 38 ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగులను పూర్తి చేయగా, ఈ ఘనతను అందుకోవడానికి హషీమ్ ఆమ్లాకు 40 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. వీరిద్దరి తరువాతి స్థానంలో పాకిస్తాన్ లెజెండ్ జహీర్ అబ్బాస్ ఉన్నాడు. అబ్బాస్ 45 ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో రెండు వేల పరుగులను సాధించాడు.

No comments:

Post a Comment