చిత్రం : డిస్కో రాజా సంగీతం : తమన్ సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా..
ఎటు సాగాలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం,
తీర్చేశావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగాలతో మందహసాలు చిలికే పరాగాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా.. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో..
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసి పోతున్నా ఆహాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
No comments:
Post a Comment